NRPT: హైదరాబాద్లో శనివారం జరిగే తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావ సభకు జిల్లా నుంచి భారీ ఎత్తున రైతులు తరలివెళ్లారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో సుమారు 25 ట్రాక్టర్లతో కూడిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కవిత స్థాపించబోతున్న ఈ కొత్త పార్టీకి జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోందని, సామాజిక న్యాయమే లక్ష్యంగా ఈ ప్రస్థానం సాగుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.