BDK: జిల్లా వ్యాప్తంగా నేడు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని పినపాక మండలం ఈ. బయ్యారంలో అత్యధికంగా 44.1°C ఉష్ణోగ్రత నమోదైంది. లక్ష్మీదేవిపల్లిలో 43.8°C, భద్రాచలంలో 43.7°C, చర్లలో 43.6°Cగా రికార్డయింది. జిల్లాలోని పలు మండలాల్లో 40°C నుంచి 44°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.