పోలవరం జిల్లా జేసీగా ప్రశాంత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఐటీడీఏ పీవోగా పనిచేసిన స్మరన్ రాజ్ ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించారు. స్మరన్ రాజ్‌ను బదిలి చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐటీడీఏ పీవోగా కూడా ప్రశాంత్ కుమార్ వ్యవహరించనున్నారు.