TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి బంగారు పతకాలను అందజేశారు.