MLG: జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్ నేతలు ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమని ఆరోపించారు. మృతుడికి న్యాయం కోరుతూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కుటుంబానికి రూ.1 కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.