NRPT: వరి ధాన్యం పండించిన రైతులు దళారులను నమ్మి అమ్ముకోవద్దని మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులకు ఇబ్బందుకు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.