PPM: మండల కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సూచించారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం పాలకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, హాజరు పట్టిక, భూమి వివరాలు పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులను గడువులో పరిష్కరించాలని, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.