కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో గురువారం శ్రీ నల్ల మారమ్మ ముత్యాలమ్మ దేవాలయం వద్ద సేవా కార్యక్రమం నిర్వహించారు. దేవాలయం ముందు మొరం ఏర్పాటు చేయాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కోరడంతో యువ నాయకుడు, 6వ వార్డు సభ్యుడు అన్మాల రామ్ కుమార్ స్పందించి రూ.10,000 విరాళంగా అందజేశారు. దేవాలయ అభివృద్ధికి స్థానికుల సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు.