AP: అత్యంత వెనుకబడిన రంగారెడ్డి జిల్లా దేశంలో ధనిక జిల్లాగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ పెట్టుబడులు వచ్చినా అనకాపల్లి జిల్లాకే వస్తాయని తెలిపారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు ఐదేళ్లు పెంచబోమని చెప్పామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగాన్నికుప్పకూల్చారని ఆందోళన వ్యక్తం చేశారు.