RR: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ కార్పొరేషన్ వివిధ కాలనీల అధ్యక్షులు ఇవాళ TUFIDC ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.