PDPL: ఓదెల మండలం జడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి పాఠశాలకు చెందిన ఎన్సీసీ అధికారి గుగులోతు రవి, కరీంనగర్‌లోని ఎన్సీసీ 9(టీ) బెటాలియన్‌లో సెకండ్ ఆఫీసర్‌గా ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఏకే జయంత ర్యాంక్‌ను గౌరవప్రదంగా అందజేశారు. ఈ విజయంతో పాఠశాలకు గౌరవం పెరిగిందని ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు.