NZB: టీయూ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన MLC, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులను తప్పకుండా పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలని పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. తనదైన శైలిలో పాటలు పాడి విద్యార్థులను ఉత్తేజపరిచారు.