ప్రకాశం: మార్కాపురం(M) రాయవరం వద్ద బుధవారం కుంభాకార దర్పణాలను ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో భద్రతను మెరుగుపరిచే దిశగా వీటిని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాలు సంభవిస్తున్న మలుపుల జంక్షన్లో, టీ జంక్షన్, వై జంక్షన్, యూటర్న్ వెసెబులిటీ తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి ఈ కుంభాకార దర్పణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.