‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతానని చెప్పాడు. ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబైలో జరుగుతున్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేశానని, టీం అంతా షాక్ అయిందని అన్నాడు. ఫ్లైట్లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి ‘మీరు మాములు వాళ్లు కాదండి అన్నాడు’ అని చెప్పాడు.