హన్మకొండ నగరంలోని కేయూ కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి రూ. కోటి నిధులు కేటాయించినట్లు వీసీ ప్రతాప్ రెడ్డి మంగళవారం తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, ఆధునిక పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి క్యాంపస్ విద్యార్థికి ‘CELT’ సర్టిఫికేషన్ తప్పనిసరి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.