ADB: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ఇచ్చోడ మండలం సాత్ నంబర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పర్యటించారు. గ్రామానికి చెందిన పలువురి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేద ప్రజల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.