MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని సగర సంగం జిల్లా అధ్యక్షులు ప్రనిల్ చందర్ అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఇవాళ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. గత ప్రభుత్వం కుల వృత్తుల వారిని అన్ని రకాలుగా ఆదుకుందన్నారు.