NGKL: కల్వకుర్తి పట్టణంలో ఉప్పర సంఘం ఆధ్వర్యంలో ఇవాళ భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ భగీరథుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కఠోర తపస్సుతో గంగను దివి నుంచి భూమికి తెచ్చిన గొప్ప నాయకుడు భగీరథ మహర్షి అన్ని కొనియాడారు.