SDPT: బెజ్జంకి వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రైతులు పండించిన మొక్కజొన్నను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మార్కెట్లో కనీస సదుపాయాలు లేకపోవడం, తాగునీటి కొరత, పంట శుభ్రపరిచే యంత్రాలు పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు.