AP: సీఎం చంద్రబాబు తీరుచూస్తుంటే భయపడుతున్నట్లు తెలుస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘అధికారం కోసం నోటికొచ్చిన వాగ్ధానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఊదరగొట్టారు. రెండేళ్లయినా మేనిఫెస్టో అమలు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను.. తట్టుకోలేక బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.