SKLM: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి 51వ వార్షికోత్సవ నవరాత్రి యాత్ర మహోత్సవాల్లో భాగంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.