బాపట్ల: జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 181 మంది జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వీటిని అందజేశారు. అనంతరం కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ప్రాణ రక్షణకు హెల్మెట్ వాడకం తప్పనిసరి అని అధికారులు సూచించారు.