KDP: ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు కిరాయి హంతకుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హిందూపురానికి చెందిన ఈ ముఠా, లింగాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేయడానికి సుఫారీ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ మహిళ తన భర్తను చంపడానికి.. ప్రియుడితో కలిసి రాజుపాలెంకు చెందిన రౌడీ షీటర్ ద్వారా ఈ ముఠాను సంప్రదించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.