AKP: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఓ పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమం ఇంకో పక్క లాండ్ ఆర్డర్ని నియంత్రిస్తూ చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ అండ ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.