MDK: శివంపేట మండలం ఉసిరిక పల్లి వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదఘటనపై మాజీమంత్రి హరీష్ రావు తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పాంబండ తండాకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. గాయపడిన వారికి తక్షణం వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.