సత్యసాయి: ఈనెల 26న అనంతపురంలో నిర్వహించనున్న ‘బీసీల గళం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను హిందూపురం YCP ఇంఛార్జ్ టీఎన్ దీపిక విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో బీసీలకు రాజకీయంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, సముచిత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు.