HNK: బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో 29, 11వ డివిజన్లకు సంబంధించి 29 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 29,03,364 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MLA నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.