తన పదేళ్ల కష్టానికి దక్కిన అరుదైన బహుమతిగా ‘డంకీ’ సినిమా అని నటి తాప్సీ తెలిపింది. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా అంగీకరించేందుకు మేకర్స్ సమయం తీసుకుంటున్నారని పేర్కొంది. ‘పింక్’, ‘తప్పడ్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో తన నటనను చూసే దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తనకు ‘డంకీ’ అవకాశం ఇచ్చాడని వెల్లడించింది.