MDK: హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ అన్నారు. పెద్ద శంకరంపేట తిరుమలాపూర్ జ్యోతిర్లింగాల ఆలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. హిందూ సమ్మేళనం పురస్కరించుకొని రామాలయం నుంచి పురవీధుల గుండా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.