RR: నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తుల సమక్షంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు.