NGKL: చారిత్రక కట్టడాలకు నిలయమైన కొల్లాపూర్ సందర్శకులను కట్టిపడేస్తోంది. ఇక్కడి రాజా బంగ్లాలోని మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్ భవనాలు అప్పటి నిర్మాణ శైలికి అద్దం పడుతున్నాయి. 1884లో నిర్మించిన ఈ కట్టడాలతో పాటు, రాజ కుటుంబీకుల కోసం ఏర్పాటు చేసిన తోట బంగ్లా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.