AP: కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆర్. శుభ(32) తాజాగా మృతి చెందింది. మృతురాలు కర్ణాటక హాసన్ జిల్లా బేలూరు తాలూకా, శెట్టిగేరె గ్రామ వాసిగా గుర్తించారు. ఇదే రాష్ట్రానికి చెందిన జయమ్మ (60) కూడా మృతి చెందింది. దీంతో ఈ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 11కు చేరుకుంది.