మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి బిజీ జీవితంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రిపూట కొన్ని ఆహారాలను తీసుకోవడం మానేయాలి. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు వంటి వాటిలో కెఫీన్ ఉంటుంది. ఇవి మెదడును చురుకుగా ఉంచి నిద్ర పట్టకుండా చేస్తాయి. కేకులు, స్వీట్లకు కూడా దూరంగా ఉండాలి.