చెపాక్ స్టేడియం గురించి ఇతర క్రికెటర్లు చెప్పగా విన్నానని, కానీ అక్కడ ఆడినప్పుడే ఆ మజా ఏంటో తెలిసిందని సికిందర్ రజా అన్నాడు. ముఖ్యంగా ధోనీ గ్రౌండ్లోకి వస్తుంటే అభిమానుల అరుపులతో చెపాక్ స్టేడియం దద్దరిల్లాల్సిందేనని పేర్కొన్నాడు. స్టేడియం చిన్నదైనా ప్రపంచంలోనే అత్యంత రణగొణధ్వని కలిగిన మైదానమని తెలిపాడు. అక్కడ ధోనీ మేజిక్‌ను మేమంతా అనుభూతి చెందామని చెప్పుకొచ్చాడు.