RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు రజక నగర్, అంబేద్కర్ నగర్లలో బోరు మోటర్ పాడైపోయింది. ఈ విషయాన్ని స్థానికులు వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ బోరు మోటార్లను బాగు చేయించారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.