BDK: కొత్తగూడెంలో భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మికుమారి మాట్లాడుతూ.. సమాఖ్య భావనను కాలరాసే విధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కారు ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా వేసే ఏ ఓటైనా మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన ఓటుగా చిత్రీకరించేందుకు సిద్ధమైందన్నారు.