MDCL: కాప్రా GHMC సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు పురోగమిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.33 కోట్ల మేరకు పన్ను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.72.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.