TG: రైతులు దగాపడుతుంటే చూస్తూ ఊరుకోమని MP ఈటల రాజేందర్ అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు బాధితులకు అండగా ఆయన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. RRR భూసేకరణ బాధ్యతను.. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందన్న ఈటల.. బాధితుల రూ.5కోట్ల ఇళ్లు కూలగొట్టి రూ.5లక్షలు ఇవ్వడం సరికాదన్నారు. భూసేకరణపై స్థానికుల అభిప్రాయం తీసుకోరా? అని ప్రశ్నించారు.