నటి సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల సమంత మనస్తాపానికి గురై ఉంటే బేషరుతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ‘మీరంటే నాకు అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. మీ మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు’ అని పేర్కొన్నారు. కాగా, కొండా సురేఖ వ్యాఖ్యలను సమంత తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.