MDK: పైతర మంజీర చెక్ డ్యామ్‌కు సింగూర్ నీళ్లు విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు పూల అర్చనతో ఘనస్వాగతం పలికారు. పంటలు ఎండిపోకుండా అసెంబ్లీలో గళమెత్తి, సీఎంకు లేఖ రాసి నీటి విడుదల కోసం కృషి చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కన్నీళ్లు తుడిచిన ఎమ్మెల్యేకు ఎప్పటికీ రుణపడి ఉంటామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.