RR: కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో గత 4 రోజులుగా 1వ వార్డులో బోరు మోటార్ పాడైంది. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు వార్డ్ మెంబర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు. సర్పంచ్ వెంటనే బోరుమోటర్ను బాగు చేయించారు. సమస్యకు వెంటనే స్పందించే ఇలాంటి గొప్ప నాయకుడు గ్రామంలో ఉండటం గ్రామానికి ఎంతో అవసరమని ప్రజలు అన్నారు.