ADB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మావల మండల స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కృష్ణవేణి తెలిపారు. ఉదయం 10 గంటలకు రైతు వేదికలో సభ ప్రారంభమవుతుందన్నారు. మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.