MLG: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘దోస్త్’ సహాయ కేంద్రాన్ని ప్రిన్సిపల్ మల్లేశం బుధవారం ప్రారంభించారు. విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియలో సహాయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రవేశాల రిజిస్ట్రేషన్ మూడు దశల్లో జరుగుతుందని, తొలి విడతలో రూ. 200, తదుపరి విడతల్లో రూ. 400 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.