MDCL: మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 108 ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 10వ తేదీ వరకు అల్పాహార కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా DEO విజయకుమారీ తెలిపారు. ప్రతి విద్యార్థిపై రోజుకు రూ.15 చొప్పున వెచ్చించి పోషకాహారం అందిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇది శక్తినిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.