AP: గతంలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు YCP ప్రయత్నించిందని.. ఇప్పుడు మతం మంటలు రేపాలని చూస్తోందని డిప్యూటీ CM పవన్ ఆరోపించారు. YCP కుట్రలపై పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తులను, ఇతర మతాలను లక్ష్యంగా చేసుకుని ఎవరూ మాట్లాడవద్దని సూచించారు. జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది TTD చూసుకుంటుందని పేర్కొన్నారు. డిక్లరేషన్‌పై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదన్నారు.