NRML: బీసీలు ఏకం కావాలని తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్ర యాదవ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. ఈనెల 30న ఆర్డీవో కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఖండించేందుకు అధిక సంఖ్యలో ఈ దీక్షకు చేరుకోవాలని కోరారు.