JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంకేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆర్టిజన్, ఆన్మ్యాండ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మంగళవారం సంఘీభావం తెలిపారు. ఏడు రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలన్నారు.