రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతడి ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య కేవలం 1,723 మాత్రమే ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా 101Kకు చేరుకుంది. ప్రఫుల్ బౌలింగ్ ప్రదర్శనకు ఫిదా అయిన ఆరెంజ్ ఆర్మీ అభిమానులు, అతడిపై తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నారు.