GNTR: తెనాలిలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఐతానగర్లో బీఎస్ఏ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్‌ను సదరు యూత్ “మనసున్న మండల తహసీల్దార్” బిరుదులతో ఘనంగా సత్కరించారు.