KNR: తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా డా. బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అలుగునూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ కాల్వ మల్లేశం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, అఖిల పక్ష నాయకులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.